ETV Bharat / state

దుబ్బాక పోరు: తెరాస, కాంగ్రెస్‌, భాజపా నేతల ఆరోపణల పర్వం - దుబ్బాక ఎన్నికల ప్రచారం వార్తలు

కాంగ్రెస్‌ వాళ్లకు అవకాశం ఇస్తే దుబ్బాకను మరో పదేళ్లు వెనక్కి తీసుకుపోతారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. నిరుద్యోగ యువతను మభ్యపెడుతున్న తెరాస సర్కార్‌కు దుబ్బాకలో ఝలక్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు విమర్శలకు పదును పెడుతున్నారు. భాజపా నేతలు కేంద్ర పథకాలను ప్రస్తావిస్తూ విజయం కోసం శ్రమిస్తున్నారు.

దుబ్బాక పోరు: తెరాస, కాంగ్రెస్‌, భాజపా నేతల ఆరోపణల పర్వం
దుబ్బాక పోరు: తెరాస, కాంగ్రెస్‌, భాజపా నేతల ఆరోపణల పర్వం
author img

By

Published : Oct 11, 2020, 9:15 PM IST

దుబ్బాక ఉపఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్‌, భాజపా విమర్శలతో హోరెత్తిస్తున్నాయి. ఉపఎన్నికలో రికార్డుస్థాయి మెజార్టీతో తెరాస విజయం సాధిస్తామని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెరాసలో చేరిన వివిధ పార్టీల నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాల్లోకి ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజల నుంచి ఆదరణ లభించడం లేదని విమర్శించారు. ఎన్నికల ప్రణాళికలో లేని హామీలను అమలు పరిచిన ప్రభుత్వం తమదేనని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు

కాంగ్రెస్ హయాంలోనే ఎల్​ఆర్​ఎస్​ తీసుకురాలేదా? అని ప్రశ్నించిన హరీశ్ ... ఉత్తమ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రవాస తెలంగాణ తెరాస నేతలతో మంత్రి హరీశ్‌రావు దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచార సరళిని వివరించిన మంత్రి... ఎన్నారైలు క్రియాశీలక పాత్ర పోషించాలని దిశానిర్దేశం చేశారు. దుబ్బాకలో తెరాస చేసిన అభివృద్ధిని వారికి వివరించారు. సోలిపేట సుజాత గెలుపునకు సహకరించాలని కోరారు.

కాంగ్రెస్​కే పట్టం కట్టాలి

యువతకు ప్రభుత్వ ఉద్యోగాలివ్వలేని సర్కారు... ఎల్​ఆర్​ఎస్​ పేరుతో ప్రజలను పీడిస్తోందని కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ప్రచారంలో భాగంగా ఆయన దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్, మహమ్మద్ షాపూర్ గ్రామాల్లో ఇంటింటికెళ్లి హస్తం గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. నిత్యం ప్రజాపక్షాన పోరాడే కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని కోరారు.

ఒక్క అవకాశం కోసం..

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రస్తావిస్తున్న భాజపా నేతలు ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ జనంలోకి వెళ్తున్నారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్​ సిద్ధాంతమే సామాజిక న్యాయం: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.