ETV Bharat / state

'కంపు వాసన భరించలేకపోతున్నాం' - కంపు వాసన భరించలేకపోతున్నాం

పారిశుద్ధ్య లోపంతో గత 20 రోజులుగా మురుగు కాలువలు కంపు, దోమల బెడద ఎక్కువై ఇబ్బందులకు గురవుతున్నామని అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

drinage-problems-in-sc-colony-gowrawelly-akkannapet-mendal-siddipet-district
కంపు వాసన భరించలేకపోతున్నాం
author img

By

Published : Jun 5, 2020, 1:48 PM IST

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత 20 రోజులుగా డ్రైనేజీ కాల్వల్లో చెత్త, మురుగునీరు పేరుకుపోయి కంపు కొడుతుందని కాలనీ వాసులు తెలిపారు. మురుగు కాలువలలో చెత్తను తొలగించి శుభ్రం చేయాలని గ్రామపంచాయతీ పాలకవర్గానికి పక్షం రోజులుగా విజ్ఞప్తి చేస్తోన్న పట్టించుకోవడం లేదంటూ వాళ్లు ఆరోపించారు.

మురుగు కాల్వ నుంచి వచ్చే కంపు వాసనతో ఇంట్లో అన్నం కూడా తినలేక పోతున్నామని, మురుగు వాసన వలన కాలనీ వాసులు దగ్గు జ్వరాలు వచ్చి అనారోగ్యాలకు గురవుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ పాలకవర్గం స్పందించి మురుగు కాలువలను శుభ్రం చేయించాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.

ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య వారోత్సవాలను నిర్వహిస్తూ... గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంచాలని ప్రయత్నిస్తుంటే..పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం అద్దం పడుతోంది.

ఇదీ చూడండి: కొన్నింటికి అనుమతుల్లేవ్.. కంటైన్​మెంట్​లో కఠినం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.