రైతులు ఏవిధంగా చనిపోయినా వారి కుటుంబానికి ఆసరాగా నిలవడానికి ప్రభుత్వం రైతు బీమా కల్పిస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వెల్లడించారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తొమ్మిది మంది రైతు కుటుంబాలకు ఆయన రైతు బీమా పత్రాలను అందించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు 5లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎంపీపీ, జడ్పీటీసీ, మండల తెరాస నాయకులు, అధికారులు పాల్గొన్నారు.