సిద్ధిపేట జిల్లా వర్గల్‌లోని విద్యా సరస్వతి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఎనిమిదవ రోజు అమ్మవారు దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి చేతుల మీదుగా అష్టోత్తర కలశ పూజ నిర్వహించారు.
కలశ పూజ అనంతరం అమ్మవారికి విశేష అభిషేకం చేయించారు. అనంతరం అమ్మవారి నిజరూపానికి మంగళహారతి సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ పూజలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
- ఇదీ చదవండి : ప్రతిపక్షాల ఎత్తులను హరీశ్ రావు చిత్తు చేయగలడా..?