ETV Bharat / state

జగన్​ చూసి కేసీఆర్​ బుద్ధి తెచ్చుకోవాలి: చాడ

పార్టీ ఫిరాయింపు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్​ను చూసి కేసీఆర్​ బుద్ధి తెచ్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సూచించారు. టీఆర్టీ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అన్ని ప్రాజెక్టులను సందర్శించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

జగన్​ చూసి కేసీఆర్​ బుద్ధి తెచ్చుకోవాలి: చాడ
author img

By

Published : Jun 14, 2019, 11:24 PM IST

Updated : Jun 18, 2019, 10:56 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్​ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను చూసైన బుద్ధితెచ్చుకోవాలని హితవు పలికారు. నియామకాలు చేపట్టకుండా టీఆర్టీ అభ్యర్థులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్​ చూసి కేసీఆర్​ బుద్ధి తెచ్చుకోవాలి: చాడ

ఇవీ చూడండి: 'వాళ్ల కోసమే కాళేశ్వరం నిర్మాణ వ్యయం పెంచారు'

Intro:TG_KRN_101_14_CPI CHADA PC_ON KCR_AB_C11
FROM:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. చాడ మాట్లాడుతూ కేసీఆర్ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మెచ్చుకొని మెడల మీద వేసుకోవడం కాదు పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ నిన్న అసెంబ్లీలో ఆయన చేసిన ప్రకటనను చూసి గుణపాఠం తెచ్చుకోవాలని అన్నారు. కెసీఆర్ తెరాసలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తక్షణమే రాజీనామా చేయించి రాజకీయ విలువలను కాపాడాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈనెలాఖరులో తన రాష్ట్రంలో ప్రజా దర్బార్ పెట్టాలని అంటున్నారని, కెసిఆర్ నీ డిక్షనరీ లో ప్రజలను కలవాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణ మార్చాడాని, స్వయంగా నాతోనే వెంకన్న 1998, 2012 డీఎస్సీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, వారికి న్యాయం చేసి తీరాలని అన్నావే ముఖ్యమంత్రిగా ఉండి , 4 సంవత్సరాలు అయినప్పటికీ ఏం చేసావు కేసీఆర్ అని మీడియా ద్వారా ప్రశ్నించారు. 8వేల టిఆర్టి పోస్టులను భర్తీ చేయక టిఆర్టి అభ్యర్థులను మోసం చేస్తున్నారని, 4 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారని ,ఇలా చేస్తే ప్రజలు కూడా మిమ్మల్ని మూసివేస్తారని కేసీఆర్ ను హెచ్చరించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చిన్నోడు అని అంటున్నావు జగన్మోహన్ రెడ్డి చిన్నోడు అయిన పెద్ద మనసుతో ఉన్నాడని పరిపాలన విషయంలో జగన్ మోహన్ రెడ్డి ని చూసి గుణపాఠం నేర్చుకోవాలని చాడ కేసీఆర్ కు హితవు పలికారు.

Body:బైట్

1) సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడా వెంకటరెడ్డి

Conclusion:హుస్నాబాద్ లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం
Last Updated : Jun 18, 2019, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.