సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని భార్యాభర్తలిద్దరికీ కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. పది రోజుల క్రితం లాక్డౌన్ సడలింపుతో ముంబయి నుంచి స్వగ్రామానికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
అప్రమత్తంగా మెలగాలి...
గ్రామంలోని దారులన్నింటినీ అన్ని వైపులా పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని గస్తీ నిర్వహిస్తున్నారు. గ్రామంలోని వారు బయటకు వెళ్లకుండా... ఇతరులు గ్రామంలోకి రాకుండా నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వెంకట్రావుపేట గ్రామంలో పర్యటించారు. అనంతరం అక్కడి పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని... ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకూడదని ఎమ్మెల్యే కోరారు.