సిద్దిపేట పట్టణంలోని కొండ మల్లయ్య గార్డెన్లో అర్చకులు, పాస్టర్లు, ఇమామ్ మౌజమ్‌లతో పాటు పలువురు నిరుపేదలకు మంత్రి హరీశ్‌రావు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. అందరూ బాగుండాలని దేవుళ్లను ప్రార్థించాలని సూచించారు.
కరోనా పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించరాదని.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మంత్రి సూచించారు. అనవసరంగా రోడ్లపైకి రావొద్దన్న మంత్రి.. అత్యవసరమై బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. ఇంకొన్ని రోజులు లాక్డౌన్ పాటించి.. కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: 'లాక్డౌన్ ముసుగులో యువతకు ఉగ్రమూకల ఎర'