సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో యూపీలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్లో దళిత యువతిపై కొందరు అత్యాచారం చేసి.. ఆమె మరణానికి కారణమయ్యారు. యువతి మృతదేహాన్ని కనీసం కుటుంబానికి ఇవ్వకుండా పోలీసులే దహన సంస్కరణలు చేయడం దారుణమని డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి లింగమూర్తి తెలిపారు.
అయితే అత్యాచారం జరగలేదని..ఆ రాష్ట్ర ఐజీ నివేదిక ఇవ్వడం బాధాకరమని కాంగ్రెస్ నేతలు అన్నారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తూ దళితులపై అణచివేత ధోరణిని అవలంభిస్తోందని ఆరోపించారు. దేశంలో పేద వర్గాలకు ఒక న్యాయం ఉన్నత వర్గాల నిందితులకు మరో న్యాయం జరుగుతోందని ఆరోపించారు. రానున్న రోజుల్లో కేంద్రంలో భాజపా ప్రభుత్వం వల్ల భారత రాజ్యాంగానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు.
ఇదీ చదవండిః 'హాథ్రస్'పై హైడ్రామా- రాహుల్, ప్రియాంక అరెస్టు