ETV Bharat / state

'మండల కేంద్రంలోనే ఉండి పనులు పూర్తి చేయండి' - siddipet collector news

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై గజ్వేల్ ఐఓసీ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రాంరెడ్డి అధికారులతో సమీక్షించారు. గడువులోగా పల్లె ప్రకృతి వనాలను నిర్మించాలని ఆదేశించారు.

'మండల కేంద్రంలోనే ఉండి పనులు పూర్తి చేయండి'

author img

By

Published : Sep 30, 2020, 7:24 AM IST

భూ విస్తీర్ణం, ఆకారాన్ని బట్టి ప్రణాళిక బద్ధంగా పల్లె ప్రకృతి వనాలను నిర్మించాలని అధికారులను ఆదేశించారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై గజ్వేల్ ఐఓసీ కార్యక్రమంలో అధికారులతో సమీక్షించారు.

పగోడా(గజబో), వాకింగ్ ట్రాక్స్, ఆట వస్తువులు, బెంచీలు, గ్రీన్ వాల్, పూల మొక్కలతో కూడిన పార్కులను 15 రోజుల్లో నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీవోలు, ఏపీఓలు సంబంధిత మండలంలోని గ్రామాల బాధ్యతలు తీసుకొని పనుల్లో వేగం పెంచాలని సూచించారు.

ప్రత్యేక అధికారులు సైతం మండల కేంద్రంలోనే ఉండాలని తెలిపారు. నూతన ఆలోచనలతో పల్లె ప్రకృతి వనాలను టాల్ ప్లాంట్స్, గ్రీన్ వాల్ , కోనొకార్పస్ లాంటి మొక్కలు అందంగా కనబడేలా నాటాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనవు కలెక్టర్ మొజామిన్ ఖాన్, గడా అధికారి ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కరోనా టీకాపై గవర్నర్‌ తమిళిసై ఆశాభావం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.