ETV Bharat / state

కొండపోచమ్మ జలాశయం నుంచి గోదావరి పరుగులు

గోదావరి జలాలు మంజీరా నదిలోకి పరుగులు పెట్టాయి. అవుసులపల్లి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిని విడుదల చేయగా.. కాళేశ్వర గంగ హల్దీవాగులోకి పరవళ్లు తొక్కుతోంది. ఎండాకాలంలోనూ.. సాగునీటిని అందించేలా సంగారెడ్డి కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలో చెరువులు జలకళ సంతరించుకోనున్నాయి.. తక్షణం 14వేల ఎకరాలకు పైగా సాగు నీరు అందనుంది.

CM KCR, Konda Pochamma SAGAR
కొండపోచమ్మ నుంచి హాల్దీవాగులోకి సీఎం నీరు విడుదల
author img

By

Published : Apr 6, 2021, 11:53 AM IST

Updated : Apr 6, 2021, 12:20 PM IST

కొండపోచమ్మ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా గోదావరి జలాలను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. అవుసులోనిపల్లి వద్ద గోదారమ్మకు సీఎం కేసీఆర్, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి విజయ సంకేతం చూపించారు. కాళేశ్వరం జలాలు మంజీరాలోకి పరుగులు పెట్టడం పట్ల హర్షం ప్రకటించారు. ఈ నీళ్లు అవుసులపల్లి నుంచి మొదట వర్గల్‌లోని బంధం చెరువుకు కాళేశ్వరం నీరు చేరుకుంటాయి. అక్కడి నుంచి అదే గ్రామంలోని పెద్ద చెరువు... శాఖారంలోని ధర్మాయ చెరువు.. అనంతరం అంబర్ పేటలోని ఖాన్ చెరువు వరకు గొలుసుకట్టు ద్వారా నీరు ప్రవహిస్తుంది. ఖాన్ చెరువు నుంచి హల్దీవాగులోకి.... హల్దీ నుంచి మంజీర నదిలోకి... అక్కడి నుంచి నిజాంసాగర్‌కు కాళేశ్వరం జలాలు చేరతాయి.

హల్దీవాగుకు జలసవ్వడి

కాళేశ్వరం ప్రాజెక్టు జలాలను ప్రస్తుతం సంగారెడ్డి కాల్వ నుంచి నిజాంసాగర్‌కు విడుదలచేసినా ఇది తాత్కాలికమే. కాళేశ్వరం పథకంలో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్ పనులు పూర్తికావడానికి మరో రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉండటంతో.. ప్రత్యామ్నాయంగా కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీవాగు.. తద్వారా నిజాంసాగర్‌కు నీరు తరలిస్తున్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌కు 5 ఓటీ స్లూయిస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఒకటి సింగూరు ప్రాజెక్టుకు వెళ్లే కాల్వ.. ఈ తూము వద్ద 4 గేట్లు ఉంటాయి. ఇక్కడి నుంచి సింగూరు ప్రాజెక్టుకు నీటిని పంపిస్తారు. ఈ కాల్వ కెపాసిటీ 6 వేల కూసెక్కులు ఉంటుంది. ఇదే కాల్వ నుంచి హల్దీవాగుకు నీటిని విడుదలచేస్తారు.

కొండపోచమ్మ జలశయం నుంచి గోదావరి పరుగులు

పంటలకు పచ్చందనం

ప్రస్తుతం నిజాంసాగర్ లో 7.2టీఎంసీల నీరు నిల్వ ఉంది. యాసంగి పంటలకు మరో తడి ఇవ్వడానికి 1.2టీఎంసీలు విడుదల చేయనున్నారు. హల్దీ వాగు ద్వారా మరో 4 టీఎంసీల నీటిని అందించనున్నారు. నిజాంసాగర్‌లో మొత్తం నీటి నిలువ 10 టీఎంసీలకు చేరనుంది. వచ్చే వర్షకాలంలో వానలు సకాలంలో రాకపోయినా.. ఈ నీటితో పంటలు సాగు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

19చెరువులకు జలకళ

అనంతరం మర్కుక్ మండలంలోని పాములపర్తి వద్ద గజ్వేల్ కాలువలోకి ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిని విడుదల చేశారు. గజ్వేల్ కాలువ ద్వారా మర్కుక్, గజ్వేల్ మండలాల్లోని 19చెరువులు జలకళను సంతరించుకోనున్నాయి.

ఇదీ చదవండి: 24 గంటల్లో రికార్డుస్థాయిలో కరోనా కేసులు

Last Updated : Apr 6, 2021, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.