CM KCR Attend BRS Public Meeting at Cheryal : తెలివితో ఓటు వేస్తేనే.. తెలివైన ప్రభుత్వం వస్తోందని సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రజలకు బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) హితవు పలికారు. రాష్ట్ర తలరాతను మార్చే ఓటును వివేకంతో వేయాలని ఓటర్లకు సూచించారు. చేర్యాల నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఏం చేసిందో గమనించాలని సీఎం కేసీఆర్ కోరారు. బీఆర్‌ఎస్(BRS) పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కులను కోసమని తెలిపారు. ఆనాడు తెలంగాణను ఆంధ్ర(Andhra Pradesh)లో కలిపి 58 ఏళ్లు గోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ(Congress)నని ధ్వజమెత్తారు. ఎంతో పోరాటం చేసి తెలంగాణను మళ్లీ సాధించుకున్నామని పేర్కొన్నారు. పదేళ్ల క్రితం ఎట్లా ఉందో తెలంగాణ గుర్తు చేసుకోవాలని వివరించారు. ఆంధ్రోళ్ల బూట్లు మోసిన వ్యక్తి వచ్చి ఇవాళ కేసీఆర్‌ను తిడుతున్నారని మండిపడ్డారు. పార్టీ విధానాలు చెప్పకుండా తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తాను తిట్టడం మొదలు పెడితే రేపటివరకు ఆపకుండా తిట్టగలనని కేసీఆర్ ఘాటుగా స్పందించారు.
'రైతుబంధు ఉండాలో వద్దో రైతులే ఆలోచించుకోవాలి'
CM KCR Election Campaign in Telangana : సమైక్య ఆంధ్రలో ఉన్నప్పుడు తమ కష్టాల గురించి ఎవరైనా ఆలోచించారా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడేనాటికి పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని గుర్తు చేశారు. తాగునీరు, సాగునీరు, కరెంటుకు ఎన్నో కష్టాలు ఉండేవన్నారు. రైతులు ఆత్మహత్య(Former Suicides) చేసుకునే పరిస్థితులు కల్పించేందే కాంగ్రెస్ అని అన్నారు. బిహార్ నుంచి జీఆర్ రెడ్డిని పిలిపించి పథకాలపై అధ్యయనం చేశానని చెప్పారు. పింఛన్లను రూ.1000తో ప్రారంభించి రూ.2వేలకు పెంచామని స్పష్టం చేశారు.
BRS Praja Ashirvada Sabha at Cheryal : మళ్లీ గెలిస్తే.. పింఛన్లను క్రమంగా రూ.5 వేలకు పెంచుతామని సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు. ఏ రాష్ట్రంలోనైనా రూ.2 వేల పింఛను ఉంటే ముక్కును నేలకు రాస్తానని సవాల్ విసిరారు. సంపద పెరిగే కొద్ది సంక్షేమ పథకాలు పెంచుకుంటూ పోతామన్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రాజెక్టుల కింద నీటి తీరువా ఉందని వాపోయారు. వ్యవసాయ స్థిరీకరణ సాధించాలని రైతుబంధు(Rythu Bandhu) అమలు చేశామని అన్నారు. రైతులు పండించే పంటనంతా గ్రామాల్లోనే కొంటున్నామని వివరించారు. ఇంకో పదేళ్లు పాలన ఇలాగే ఉంటే రైతులంతా బాగుపడతారని జోస్యం చెప్పారు.
"రాష్ట్రంలో ఇవాళ 3 లక్షల కోట్ల టన్నుల వరి పండుతోంది. ధాన్యం దిగుబడిలో పంజాబ్ స్థాయికి చేరుకున్నాము. రైతుబంధు ఇచ్చి ప్రజలు డబ్బు వృథా చేస్తున్నానని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతుబంధు ఇలాగే ఉంటుంది. ఇంకా రూ.16 వేలకు పెంచుతాము. బీఆర్‌ఎస్ గెలిస్తే.. 24 గంటల కరెంటు ఉంటుందని.. అదే కాంగ్రెస్ గెలిస్తే 3 గంటల విద్యుత్ ఉంటుంది"- కేసీఆర్, బీఆర్‌ఎస్ అధిపతి
ధరణి తీసేసే కాంగ్రెస్ కావాలా.. బీఆర్‌ఎస్ కావాలా : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి(Dharani)ని తీసేస్తామని.. కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. మరి ఆ పోర్టల్‌ను తీసేస్తే రైతుబంధు, ధాన్యం డబ్బులు ఎలా వస్తాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ చెప్పారని.. ఆ మోటార్లు పెట్టకుంటే నిధులు నిలిపివేస్తామని బెదిరించారని చెప్పారు. మోటార్లకు మీటర్లు పెట్టనందుకు రాష్ట్రానికి రూ.30 వేల కోట్లు కోత పెట్టారని విమర్శలు చేశారు. అందుకే కరెంటు వృథా.. రైతుబంధు వృథా అంటున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలన కోరారు.
రైతుబంధు వంటి సంక్షేమ పథకాలు, రైతుల జీవితాల్లో వెలుగులు నింపాయి : కేసీఆర్
విచక్షణతో ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలుస్తారు: కేసీఆర్