సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేరును ఖరారు చేసింది. తెరాసలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి శ్రేయోభిలాషులు, అభిమానులు, బంధువులతో చర్చలు జరిపారు. అప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలతో చర్చలు జరిపిన ఆయన రెండు రోజుల క్రితం గులాబీ గూటిని వీడి హస్తం గూటికి చేరారు.
అప్పటికే బలమైన అభ్యర్థి కోసం చూస్తున్న కాంగ్రెస్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని బరిలో దింపాలని నిర్ణయించింది. అదే విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నేతలు అధిష్ఠానానికి నివేదించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్ర పార్టీ నివేదించిన అభ్యర్థి పేరు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇదీ చదవండి: సోలిపేట సుజాతకు కేసీఆర్ బీ ఫారం అందజేత