సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురి శివారు దూదేకులపల్లికి చెందిన రైతు శ్రీనివాసరెడ్డి పొలంలో బోరు బావి తవ్వేందుకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కూలీలు శనివారం అర్ధరాత్రి వరకు పని చేశారు. పని పూర్తయిన అనంతరం బోరు లారీకి సమీపంలో పాయమి లక్ష్మణ్ , విజయ్ అలసిపోయి నిద్రించారు. బోర్‌వెల్స్ వాహన భాగస్వామి, డ్రైవర్ అయిన ఎన్.వెంకట్ ఆదివారం తెల్లవారు జామున పరిసరాలు గమనించకుండానే బోరు బండిని వెనక్కి నడిపించాడు.
నిద్రలో ఉన్న లక్ష్మణ్, విజయ్ తలల మీదుగా వాహనం వెళ్లింది. ఒక్కసారిగా కేకలు వినిపించడం వల్ల చోదకుడు వాహనం ఆపి కిందికి దిగి చూడగా ఇద్దరూ చనిపోయి కనిపించారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా ఘోత్పల్ గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు భార్య, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. భైరామ్ గఢ్ జిల్లా పూనమ్ లేకంపడ గ్రామం నుంచి విజయ్ 3నెలల క్రితం ఉపాధి కోసం వలస వచ్చాడు.