ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా... బతికుండి పోరాటం చేసి సమస్యలు పరిష్కరించుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ డిపో వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో... రాజీపడకుండా సమ్మె చేస్తున్న కార్మికులను అభినందించారు. ప్రజలు తిరగబడితే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. చిన్న జీయర్ స్వామి అక్షతలు, కోర్టు మొట్టికాయలు కేసీఆర్ సమానంగా స్వీకరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి: అపార్ట్మెంట్ గొడవలు... బాలుడిపై విచక్షణారహితంగా దాడి..