రాష్ట్రంలో దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ... భాజపా ఆధ్వర్యంలో సూర్యాపట జిల్లా తుంగతుర్తి, మోత్కూరు తహశీల్దార్ కార్యాలయాల ఎదుట దీక్షలు చేశారు. సిద్ధిపేట జిల్లాలో దళిత బిడ్డ నర్సింలు ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు.
నర్సింలు కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం, మూడు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కమలం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: పోరాడైనా కృష్ణా, గోదావరి జలాలను దక్కించుకుంటాం: కేసీఆర్