సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తం రెడ్డి ప్రారంభించారు. 2023వ సంవత్సరంలో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త క్షేత్రస్థాయిలో కృషి చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లాలో లక్షా 50 వేల సభ్యత్వ నమోదు లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు తెలిపారు. అంతకు ముందు సభ్యత్వం తీసుకున్న పలువురు సభ్యులకు రశీదులను అందించారు.
ఇవీచూడండి: వేగంగా బీఆర్కే భవన్‌కు కార్యాలయాల తరలింపు