ETV Bharat / state

Etela Rajender Speech: 'కేసీఆరే కాదు.. ఆయన జేజమ్మ వచ్చినా నన్ను ఓడించలేరు' - bjp leader Etela Rajender speech in husnabad

హుజూరాబాద్​లో జరుగుతున్న కురుక్షేత్రంలో ధర్మమే గెలుస్తుందని ఈటల రాజేందర్​ స్పష్టం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఈటల... తెలంగాణ ప్రజలంతా హుజూరాబాద్​ వాసులకు భరోసాగా నిలుస్తున్నారని తెలిపారు.

bjp-leader-etela-rajender-speech-in-husnabad

author img

By

Published : Oct 2, 2021, 6:59 PM IST

తెలంగాణ యావత్తు హుజూరాబాద్​ వైపు చూస్తోందని భాజపా నేత ఈటల రాజేందర్​ తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో ఈటల పాల్గొన్నారు. హుజూరాబాద్​లో ఐదు నెలలుగా డా.అంబేడ్కర్​ రచించిన రాజ్యాంగానికి బదులు.. కేసీఆర్​ రాసుకున్న రాజ్యాంగం అమలవుతోంది. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక ఉపఎన్నిక కోసం ఇన్ని వేల కోట్ల ​జీవోలు ఇచ్చి, ఇన్ని రకాల ప్రలోభాలకు గురి చేయటం ఇదే మొదటిసారని ధ్వజమెత్తారు.

ధర్మమే గెలుస్తుంది..

"ఒక్కడి ముఖం అసెంబ్లీలో కనిపించకుండా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాలు జారీ చేస్తే.. ఆయన బానిసలు చాలా మంది వాటిని అమలు చేస్తున్నారు. మద్యం ఏరులై పారుతోంది. వందల కోట్లతో మనుషులకు విలువకట్టే ప్రక్రియ కొనసాగుతోంది. అక్టోబర్​ 30న హుజూరాబాద్​లో కురుక్షేత్ర యుద్ధం చివరి దశ. ఈ యుద్ధం కేసీఆర్​ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి జరుగుతోంది. ఈ యుద్ధంలో ధర్మమే గెలుస్తుంది. ప్రజలే గెలుస్తారు. పద్దెనిమిదేళ్లలో ఉద్యమకారునిగా, ఎమ్మెల్యేగా, ఫ్లోర్​ లీడర్​గా, మంత్రిగా రాష్ట్రానికి చేసిన సేవ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంది. దాన్ని చెరిపేసే సత్తా.. కేసీఆర్​కే కాదు.. ఆయన జేజమ్మ వాళ్ల కూడా కాదు." - ఈటల రాజేందర్​, హుజూరాబాద్​ భాజపా అభ్యర్థి

'కేసీఆరే కాదు.. ఆయన జేజమ్మ వచ్చినా నన్ను ఓడించలేరు'

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.