ETV Bharat / state

గణేశ్​ మండపాల తొలగింపు నిరసిస్తూ ఆందోళన

గణేశ్​ మండపాల తొలగింపును నిరసిస్తూ... సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో భాజపా, వీహెచ్​పీ నాయకులు నిరసన తెలిపారు. ఇతర మతాలకు లేని ఆంక్షలు హిందువులపై ఎందుకని ప్రశ్నించారు.

bjp and vhp leaders protest in husnabad against ganesh stages removal
గణేశ్​ మండపాల తొలగింపునకు నిరసనగా ఆందోళన
author img

By

Published : Aug 24, 2020, 5:20 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో గణేశ్​ మండపాల తొలగింపునకు నిరసనగా... ప్రభుత్వానికి వ్యతిరేకంగా భాజపా, వీహెచ్​పీ నాయకులు నిరసన తెలిపారు. ముఖానికి నల్లటి మాస్కులు ధరించి, ప్లకార్టులు పట్టుకొని ఆందోళన చేపట్టారు. మండపాలు తొలగించాలని బెదిరిస్తున్న పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్​ చేశారు. మైనారిటీలకు లేని ఆంక్షలు హిందువులకే ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​కు హిందూ పండుగలపై మమకారం తగ్గుతోందని నాయకులు ఆరోపించారు. కరోనా నేపథ్యంలో... నిబంధనల మేరకు ఉత్సవాలు జరిపిస్తామని తెలిపిన ప్రభుత్వం ఇప్పుడిలా వ్యవహరించడం సరికాదన్నారు. హిందుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తెరాసకు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో పండుగలపై ఆంక్షలు విధించకుండా నడుచుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి : విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.