ETV Bharat / state

'దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి'

author img

By

Published : Oct 31, 2020, 7:23 PM IST

Updated : Oct 31, 2020, 8:07 PM IST

దుబ్బాక ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సిద్దిపేట కలెక్టర్ భారతి హోళీకేరీ, సీపీ జోయల్ డేవిస్​ వెల్లడించారు. మొదటిసారిగా ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్​ అవకాశం ఉన్నందున... కొవిడ్ రోగులు, దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ నెల 4 వరకు 144 సెక్షన్​ అమలులో ఉంటుందని వెల్లడించారు.

arrangements completed for dubbaka by elections
'దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి'

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... ప్రొటోకాల్​ ప్రకారం దుబ్బాక ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సిద్దిపేట కలెక్టర్ భారతి హోళీకేరీ, సీపీ జోయల్ డేవిస్​ వెల్లడించారు. 315 పోలింగ్ కేంద్రాల్లో... మైక్రో అబ్జర్వర్లు, వీడియో గ్రాఫర్​లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి పోలింగ్​ కేంద్రానికి వెయ్యి మందికి మించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు వివరించారు. కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించే ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రతి ఓటరు మాస్క్​, గ్లౌస్​లు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

మొదటిసారి పోస్టల్ బ్యాలెట్

ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, మరోసారి కూడా ఇస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. 3600 మంది సిబ్బంది ఎన్నికల్లో పాల్గోనున్నారు. మొదటిసారిగా ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్​ అవకాశం ఉన్నందున... కొవిడ్ రోగులు, దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఉపయోగించుకోవాలని సూచించారు. కొవిడ్​ రోగులు చివరి గంటలో ఓటుహక్కు వినియోగించుకోవాలని, వారికి పీపీఈ కిట్లు ఇస్తామన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటేయాలని కోరారు.

దుబ్బాకలో లక్షా 98 వేల 756 ఓటర్లు ఉన్నట్టు కలెక్టర్ తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటి వరకు 130 మంది కొవిడ్ రోగులు ఉన్నట్టు పేర్కొన్నారు. నియోజకవర్గంలో 10 చెక్​పోస్ట్​ల దగ్గర 24 గంటలూ చెక్​ చేస్తున్నారు. సి-విజిల్​ యాప్​ ద్వారా 22 ఫిర్యాదులు అందుతున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు రూ.58 లక్షలు, రూ.58 వేల విలువైన ఆభరణాలు స్వాదీనం చేసుకున్నామని... ఆధారాలు చూపించినందున రూ.2 లక్షలు తిరిగి ఇచ్చినట్టు చెప్పారు.

4 వరకు 144 సెక్షన్

దుబ్బాకలో ఉప ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీపీ జోయల్ డేవిస్​ తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగుస్తుందని, ఈ నెల 4 వరకు 144 సెక్షన్​ అమలులో ఉంటుందని వెల్లడించారు. నియోజకవర్గానికి చెందిన ఓటర్లు తప్ప ఎవరూ ఉండకూడదని స్పష్టం చేశారు. 89 సమస్యాత్మక, 33 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహిస్తాయని తెలిపారు. మొత్తం 2 వేల మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తాయని వివరించారు. పోస్టల్ బ్యాలెట్​ కోసం 14 బృందాలను ఏర్పాటు చేసినట్టు... ఫిర్యాదులు ఎప్పటికప్పడు పరిష్కరిస్తామన్నారు. పోలింగ్ రోజున వంద మీటర్ల లోపు పార్టీ ప్రచారం చేయడం, జెండాలు ఉంచడం నిషేధమని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ధాన్యం కొనుగోళ్లలో సమస్యలా..? వెంటనే ఫోన్​ చేయండి

Last Updated : Oct 31, 2020, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.