ETV Bharat / state

ఒక్క ఆలోచన జీవితాలే మార్చేసింది... ముండ్రాయి మహిళల సాధికారత!

author img

By

Published : Mar 8, 2021, 1:13 PM IST

చిన్న పొదుపు ఆ మహిళల జీవితంలో పెద్ద మార్పు తీసుకువచ్చింది. కుటుంబ అవసరాలకు గతంలో అప్పులు చేసిన వారే నేడు స్వయం ఉపాధితో ఆర్థిక సుస్థిరత సాధించారు. ఒక్కరికీ సమస్య వచ్చినా అందరం అండగా ఉంటామన్న వారి స్ఫూర్తి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది. మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన జాతీయ అవార్డు సొంతం చేసుకున్న సిద్దిపేట జిల్లా ముండ్రాయి గ్రామ సమైఖ్యపై ఈటీవీ ప్రత్యేక కథనం.

another-award-to-mundrai-village-women-self-help-group-in-siddipet-district
ఒక్క ఆలోచన జీవితాలే మార్చేసింది... ముండ్రాయి మహిళల సాధికారత!

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముండ్రాయి ఓ సాధారణ గ్రామం. అధిక శాతం కుటుంబాలకు వ్యవసాయమే జీవనాధారం. ఊరిలో దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలే ఎక్కువ. రెక్కడితే కానీ డొక్కడాని పరిస్థితి. అనుకోని అవసరం వచ్చిందంటే.. డబ్బు కోసం అప్పు చేయాల్సిందే. అప్పు భారం ఒక ఎత్తైతే.. వడ్డీ భారం మరో ఎత్తు. ఇలా ఆర్థిక ఇబ్బందులు పడ్డ మహిళలలు 13మంది కలిసి 2002లో గీతాంజలి మహిళా స్వయం సహాయక సంఘన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాటి నుంచి వారి పరిస్థితి మారింది. వీరిని చూసి ఒక్కొక్కరుగా గ్రామంలోని మహిళలందరూ పొదుపు సంఘాల్లో చేరారు. ఇలా ప్రస్తుతం గ్రామంలో 31 సంఘాల్లో 401మంది మహిళలలు సభ్యులుగా ఉన్నారు. చిన్న చిన్న అవసరాలకు నాడు అప్పు కోసం చూసిన వారే.. ఇప్పుడు స్వయం సమృద్ధి సాధించారు.

ఆ సంఘాలతో గ్రామంలోని కుటుంబాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారింది. తొలుత నెలకు రూ.30 ప్రారంభించి.. ప్రస్తుతం నెలకు వంద రూపాయలు పొదుపు చేస్తున్నారు. వీరు పొదుపు చేసుకున్న మొత్తం సుమారు కోటి రూపాయలకు చేరుకుంది. వివిధ రూపాల్లో సుమారు 15కోట్ల రూపాయలకు పైచిలకు సొమ్ము రుణంగా పొందారు. ఇలా వచ్చిన డబ్బుతో తమ అవసరాలు తీర్చుకోవడమే కాక.. తమ అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా స్వయం ఉపాధి ఏర్పరుచుకున్నారు. కొంత మంది పాడి పశువులు కొనుగోలు చేశారు. కొందరు చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకున్నారు.

కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆ మహిళలు పడే ఇబ్బందులను పొదపు సంఘాల నిర్వాహకులు గుర్తించారు. కొంతమంది డబ్బులు లేక సరైన వైద్యం చేయించుకోలేక పోతే.. మరికొందరు వైద్యం కోసం అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకునే వారు. ఇటువంటి పరిస్థితులను అధిగమించాలంటే ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా పొదుపు చేసుకోవాలని సభ్యులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి సభ్యురాలు నెలకు 10రూపాయలు చెల్లిస్తారు. ఈ డబ్బులను సంఘ సభ్యుల కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారి చికిత్స కోసం రూ.10వేల రూపాయలు చొప్పున అందిస్తారు.

వీరి స్ఫూర్తికి వరుస అవార్డులు లభిస్తున్నాయి. దీన్ దయాల్ అంత్యోదయ యోజన- జాతీయ జీవనోపాధి కల్పన మిషన్ అవార్డు వచ్చింది. తాజాగా మరో అవార్డు వీరి సొంతం అయ్యింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రం ఇచ్చే జాతీయ పురష్కారాన్ని ముండ్రాయి గ్రామ సమైఖ్యకు ప్రకటించింది. దీనిని ఆన్​లైన్ ద్వారా కేంద్ర మంత్రులు అందించనున్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని స్వయం సమృద్ధి సాధించడంతో పాటు కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవాలన్న వీరి స్ఫూర్తి ఆదర్శనీయం.

ఇదీ చదవండి: విమెన్స్​ డే స్పెషల్: ఆమె సేవలకు సలాం... జాతీయ పురస్కారం సైతం గులాం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.