ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో 58 మంది వైరస్ బారినపడ్డారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 35 మంది ఈ మహమ్మారి బారినపడగా.. సంగారెడ్డిలో 20 మంది, మెదక్‌లో ముగ్గురికి వైరస్ సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
సిద్దిపేట జిల్లాలో 35 మందికి కరోనా సోకగా.. వీరిలో పోలీస్‌శాఖకు చెందిన 8 మంది, వైద్యారోగ్య శాఖకు చెందిన ఏడుగురు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకెజీ-11 చెందిన ఆరుగురు ఉన్నారు.
ఇక సంగారెడ్డి జిల్లాలో 20 మంది వైరస్ బారినపడగా.. ఒకరు మృతి చెందారు. మెదక్ జిల్లాలో మరో ముగ్గురికి మహమ్మారి సోకింది. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో అధికారులు రసాయనాలు పిచికారీ చేయించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కరోనా వార్డులు ఏర్పాటు..
మరోవైపు కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో వంద పడకలతో ప్రత్యేకంగా కరోనా వార్డులు ఏర్పాటు చేశారు. సిద్దిపేటలోని కరోనా వార్డును మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని.. జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని ఆయన సూచించారు. కొవిడ్ చికిత్సల కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి వివరించారు.
ఇదీచూడండి: రాష్ట్రంలో రెండు లక్షలు దాటిన కరోనా పరీక్షలు.. 39,342కు చేరిన బాధితులు