భాజపా సర్కారు రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ చట్టాలతో భాజపా ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. ఎస్సీ, గిరిజన, అల్పాదాయ వర్గాల వారికి భాజపా అన్యాయం చేస్తోందన్నారు. రఘునందన్‌రావు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆయన విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని భాజపా స్పష్టంగా చెప్పిందని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రాలకు నిధులు ఆశ చూపి రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని... కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును ప్రభుత్వం వ్యతిరేకించిందన్నారు.
దుబ్బాకలో 76 వేల మంది రైతులకు రైతుబంధు ఇస్తున్నామన్నారు. బావుల వద్ద మీటర్లు బిగించి డబ్బులు వసూలు చేసేందుకు భాజపా కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. పంట చేతికి వచ్చే సమయంలో కరెంటు కట్ చేస్తే.. రైతు ఏమైనా అఘాయిత్యానికి పాల్పడితే బాధ్యులెవరన్నారు. రైతును కాపాడుకోవాలని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పేర్కొన్నారు. రైతుల మీద భారం వేయడమంటే వారి నడ్డి విరవడమేనన్నారు. దుబ్బాక ప్రజలు సీఎం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు. రైతు బిల్లును దేశంలో చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని.. తనకు తానుగా మేధావి అని చెప్పుకుని వస్తున్న రఘునందన్ రావుకు ప్రజలే బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు.
ఇవీ చూడండి: రెండ్రోజులు వానలున్నాయ్.. అప్రమత్తంగా ఉండండి : కేసీఆర్
రఘునందన్‌రావు చెప్పేవన్నీ అబద్ధాలే: ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ - దుబ్బాక ఉపఎన్నికలు
వ్యవసాయ చట్టాలతో భాజపా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. భాజపా సర్కారు రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన విమర్శించారు. రఘునందన్‌రావు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు.