ముందస్తు సమాచారంతోనే దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇంట్లో సోదాలు నిర్వహించామని... సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. మా సిబ్బందే డబ్బు పెట్టినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. డబ్బు దొరికిన ఇంటి యజమానితో పాటు పంపించిన వ్యక్తి సంతకాలు కూడా తీసుకున్నామని స్పష్టం చేశారు.
ఎన్నికల సంఘం పరిధిలోనే పనిచేస్తున్నామన్న సీపీ... ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఎక్కువమంది ఉండడం వల్లే డబ్బు లాక్కెళ్తున్నా అడ్డుకోలేకపోయామన్న సీపీ... ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని విడుదల చేస్తామని వెల్లడించారు.
ఇవీచూడండి: దుబ్బాకలో వేడెక్కిన రాజకీయం... రణరంగంగా సిద్దిపేట