తెలంగాణలో అవగాహన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పట్టణంలో ఏసీపీ రామేశ్వర్ ఆధ్వర్యంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినారు. ఏరియా అవగాహన, భౌగోళిక పరిస్థితులు తెలుసుకోవడం గురించి నిర్వహిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
సిద్దిపేట జిల్లాలో ఏదైనా శాంతిభద్రతల సమస్య, మతఘర్షణలు జరిగినప్పుడు పోలీసులకు వెంటనే సహాయం అందించి బందోబస్తు ద్వారా అదుపు చేయడం గురించి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫ్లాగ్ మార్చ్‌తో ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో సిద్దిపేట వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ సైదులు, పరశురామ్ గౌడ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ బాలస్వామి, 100 మంది సిబ్బంది, వన్‌టౌన్, టూటౌన్ పోలీసులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: శిరస్త్రాణం లేదా?.. లైసెన్స్ గల్లంతే..!