ETV Bharat / state

దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో తహసీల్దార్ల బదిలీలు - dubbaka by elections latest news

దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో ఎనిమిది మంది తహసీల్దార్లను మెదక్​, సిద్దిపేట జిల్లాలకు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్​ 3న దుబ్బాక ఉపఎన్నిక జరగనుంది.

8 tahsildars transferred across dubbaka constituency for elections
దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో తహసీల్దార్ల బదిలీలు
author img

By

Published : Sep 30, 2020, 7:22 AM IST

దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో ఎనిమిది మంది తహసీల్దార్లను మెదక్‌, సిద్దిపేట జిల్లాలకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

పోస్టింగుకు ఎదురుచూస్తున్న ఎన్‌.రాజేందర్‌రెడ్డి, ఎం.హేమమాలిని, ఎం.శ్రీనివాస్‌రావులను సిద్దిపేట జిల్లాకు కేటాయించారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో ఏవోగా పని చేస్తున్న పి.శ్రీనివాసరావు, నారాయణపేట జిల్లాలో తహసీల్దారుగా పనిచేస్తున్న పి.శ్రీనివాసరెడ్డిలను సిద్దిపేట జిల్లాకు బదిలీ చేశారు. నారాయణపేట జిల్లాలో పనిచేస్తున్న వై.వెంకటేశ్‌, వికారాబాద్‌ జిల్లాలో పనిచేస్తున్న బీవీ శైలేంద్రకుమార్‌, ఎం.ప్రేమ్‌కుమార్‌లను మెదక్‌ జిల్లాకు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించాలి : నిరంజన్‌ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.