సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్పేట చౌరస్తాలో... పోలీసులు రూ.2లక్షల నగదు పట్టుకున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల నిర్వహణలో భాగంగా... ఈరోజు ఉదయం ప్రధాన కూడళ్ళలో వాహనాల తనిఖీ చేపట్టారు. ములుగు జిల్లా సింగరకుంటకు చెందిన రాజేందర్ అనే వ్యక్తి రూ.2 లక్షలు కారులో తీసుకెళ్తుండా పోలీసులు పట్టుకున్నారు.
ఎలాంటి ఆధారాలు లేనందున... నగదు సీజ్ చేశారు. ఈ మొత్తాన్ని ఎన్నికల అధికారికి అప్పగించినట్టు... ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ తెలిపారు. సరైన ధ్రువపత్రాలు చూపించి డబ్బులు తీసుకోవచ్చిని సూచించారు. ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేయనున్నట్టు తెలిపారు.