ETV Bharat / state

'దేశ రక్షణలో సైనికుల సేవలు మరువలేనివి' - తెలంగాణ వార్తలు

దేశాన్ని రక్షించడంలో సైనికుల పాత్ర కీలకమని సంగారెడ్డి జడ్పీ ఛైర్​పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి కొనియాడారు. వారి సేవలు, త్యాగాలు మరువలేనివని అన్నారు. ఖాదరాబాద్ గ్రామంలో వీరజవాన్ దేవయ్యకు నివాళులు అర్పించారు.

zp chairperson Tributes to the soldier devaiah , soldier devaiah  tribute
వీరజవాన్ దేవయ్యకు జడ్పీ ఛైర్​పర్సన్ నివాళులు, వీర జవాన్ దేవయ్య వర్ధంతి
author img

By

Published : May 22, 2021, 10:12 AM IST

దేశ రక్షణలో సైనికుల సేవలు, త్యాగాలు మరువలేనివని సంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, సినీ నటుడు జయంత్ రెడ్డి అన్నారు. వట్టిపల్లి మండలం ఖాదరాబాద్ గ్రామంలో వీర జవాన్ దేవయ్య 11వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవయ్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

దేశ రక్షణ కోసం విధుల్లో చేరిన దేవయ్య 11ఏళ్ల క్రితం జమ్ము కశ్మీర్​లోని సరిహద్దుల్లో విధి నిర్వహణలో భాగంగా వాహనంలో వెళ్తుండగా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో మృతి చెందారని అన్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడడంలో సైనికుల పాత్ర కీలకమైందని కొనియాడారు.

ఇదీ చదవండి: రైతుల నెత్తిన ధరల పిడుగు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.