ETV Bharat / state

తాగునీటి కోసం గ్రామస్థుల రాస్తారోకో

తాగునీరు లేక అల్లాడుతున్నామని సంగారెడ్డి జిల్లా పస్తాపూర్​లో గ్రామస్థులు రాస్తారోకో చేశారు. జహీరాబాద్​-కప్పాడ్​ రహదారిపై డ్రమ్ములు, బిందెలు పేర్చి ఆందోళన చేపట్టారు.

villagers protest for drinking water in sangareddy district
తాగునీటి కోసం గ్రామస్థుల రాస్తారోకో
author img

By

Published : May 26, 2020, 9:32 PM IST

తాగునీరు సరఫరా చేయాలని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం పస్తాపూర్​లో గ్రామస్థులు ఖాళీ డ్రమ్ములు, బిందెలతో రాస్తారోకో చేశారు. గత రెండు రోజులుగా నీటి సరఫరా చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.

జహీరాబాద్- కప్పాడ్ రహదారిపై డ్రమ్ములు, బిందెలు పేర్చి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు చేరుకుని నీటి సరఫరాలో ఇబ్బందులు తొలగిస్తామని హామీ ఇచ్చి రాస్తారోకో విరమింపజేశారు.

ఇవీ చూడండి: విద్యుత్​ స్తంభం ఎక్కిన ఐదేళ్ల బుడతడు.. కారణమిదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.