ETV Bharat / state

డంప్​యార్డు ఏర్పాటును నిరసిస్తూ గ్రామస్థుల ధర్నా - డంప్​యార్డు ఏర్పాటును నిరసిస్తూ గ్రామస్థుల ధర్నా

డంపుయార్డు ఏర్పాటును నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా చేర్యాలలో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అధికారులు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్​ చేశారు.

Villagers protest against dump yard set up
డంప్​యార్డు ఏర్పాటును నిరసిస్తూ గ్రామస్థుల ధర్నా
author img

By

Published : Sep 4, 2020, 1:47 PM IST

సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాలలో గ్రామస్థులు ధర్నాకు దిగారు. సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన డంపుయార్డును తమ గ్రామంలో నిర్మించవద్దంటూ ఆందోళన చేశారు.

ఇప్పటికే గ్రామం చుట్టూ ఉన్న పరిశ్రమల వల్ల ఏర్పడుతోన్న కాలుష్యం వల్ల అనారోగ్యాల పాలవుతున్నామని.. నూతనంగా ఈ డంప్ యార్డు ఏర్పాటు చేస్తే అనారోగ్య సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలో చాలా ఖాళీ స్థలాలు ఉండగా.. తమ గ్రామం వద్దే డంపుయార్డును ఏర్పాటు చేయవలసిన అవసరం ఏముందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని.. లేని పక్షంలో తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: పరిమితి సమయాల్లోనే హైదరాబాద్ మెట్రో సేవలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.