ETV Bharat / state

కనిపించకుండా పోయిన కల్తీకల్లు బానిసలు - lockdown news

కల్లు,మద్యం దుకాణాలు మూసి వేత కొంత మందిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మద్యానికి బానిసలైన వారి ప్రవర్తనతో కుటుంబ సభ్యులతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడుతోంది.

కనిపించకుండాపోయిన కల్లు బానిసలు
కనిపించకుండాపోయిన కల్లు బానిసలు
author img

By

Published : Mar 31, 2020, 1:47 PM IST

ప్రపంచమంతటిది ఒక సమస్యైతే.. కల్లు, మద్యం బానిసలది మరో సమస్య. వింత ప్రవర్తన, ఆత్మహత్య యత్నం, ఆత్మహత్యలతో అధికారులకు చుక్కలు చూపిస్తోన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం చిట్కుల్ గ్రామస్థుడు భవాని కృష్ణకు కల్తీకల్లుకు బానిసయ్యాడు. లాక్​డౌన్​ కారణంగా కల్లు, మద్యం లభించకపోయే సరికి కొద్ది రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఈ నెల 27న ఇంటి నుంచి బయటకు వెళ్లిన భవాని కృష్ణ తిరిగి రాలేదు. ఆచూకి లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇస్నాపూర్​లో ఉంటూ కల్లుకు బానిసైన సత్తయ్య కూడా నిన్న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పటాన్​చెరు పోలీసులకు సమాచారమివ్వగా కేసు నమోదు చేసుకున్నారు. ఇరువురి కోసం గాలిస్తోన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు భరోసా కల్పిస్తేనే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.