ETV Bharat / state

tragedy: పసివయసులో పుట్టెడు దు:ఖం.. 'నాన్నా... నువ్వూ వెళ్లిపోయావా!'

ముక్కు పచ్చలారని పసితనంలో ఆ చిన్నారులకు పుట్టెడు కష్టం వచ్చింది. విధి ఆడిన వింత నాటకంలో అమ్మానాన్నలను పోగొట్టుకొని అనాథలుగా మిగిలిపోయారు. అమ్మ ఎటుపోయిందో అర్థంకాని పరిస్థితుల్లోనే నాన్న కూడా వారిని వదిలి వెళ్లి పోయాడు. తమకు ఎంత కష్టమొచ్చిందనే విషయమూ అర్థంకాని పరిస్థితి. ఆ చిన్నారుల దీనస్థితిని(tragedy) చూసి స్థానికులు కంటతడి పెడుతున్నారు.

tragedy, two children loss theirs parents
అనారోగ్యంతో భార్యాభర్తలు మృతి, తల్లిదండ్రులను కోల్పోయిన భార్యాభర్తలు
author img

By

Published : Nov 1, 2021, 11:51 AM IST

తన బిడ్డలకు ఏ చిన్న కష్టమొచ్చినా అల్లాడిపోతుంది తల్లి. అలాంటి అమ్మ ప్రేమకు ఆ బిడ్డలు దూరమయ్యారు. ఇక అమ్మయినా, నాన్నయినా అన్నీ తండ్రేనని భావించారు. తల్లిని కోల్పోయిన తన పిల్లలను బాగా చూసుకోవాలని అనుకున్నారు ఆ తండ్రి. అమ్మ లేని లోటు రాకుండా పెంచాలనుకున్నారు. భార్య మరణించిన ఆరు రోజులకే అనారోగ్యం ఆయననూ బలితీసుకుంది. తల్లిదండ్రులిద్దరూ కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో అనాథలుగా(tragedy) మారిన ఆ ఇద్దరు చిన్నారులను చూసి స్థానికులు కంటతడిపెడుతున్నారు. ఇదీ చదవండి: 'అమ్మ ముందే చనిపోయింది.. తర్వాత నాన్న వెళ్లిపోయాడు'

విధి ఆడిన వింత ఆట

సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం అమీరాబాద్‌కి చెందిన బిరాదర్‌ మారుతీరావు (26), స్వప్న(24) దంపతులు. వీరికి కేవలం పది గుంటల పొలం మాత్రమే ఉంది. జీవనాధారం కోసం గ్రామంలో చిన్న టీకొట్టు నడుపుకునేవారు. వీరికి ఇద్దరు పిల్లలు విఘ్నేష్‌ (6), రాధాబాయి (4). ఉన్నంతలో హాయిగా జీవనం సాగిస్తున్నారు. వీరి కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టినట్టుంది. అల్లారు ముద్దుగా పెరుగుతున్న చిన్నారులను అనాథలుగా చేసింది. ఇదీ చదవండి: 'ఆలనా పాలనా' ప్రభుత్వ బాధ్యతే!

అనారోగ్యంతో..

భార్యాభర్తలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అక్టోబరు 26న స్వప్న మరణించింది. ఆ బాధ నుంచి తేరుకోకముందే ఆదివారం తెల్లవారుజామున మారుతి మరణించారు. కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఆయనను గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఆరురోజుల వ్యవధిలోనే అమ్మానాన్న చనిపోవడంతో విఘ్నేష్‌, రాధాబాయిల ఆలనాపాలనా చూసే వారు కరవయ్యారు. మారుతీరావు తల్లిదండ్రులు సైతం 15సంవత్సరాల క్రితమే చనిపోయారు. ఇదీ చదవండి: 'అమ్మ ముందే చనిపోయింది.. తర్వాత నాన్న వెళ్లిపోయాడు'

అధికారులు అండగా నిలవాలి..

చిన్నారులిద్దరి వయసు పదేళ్లలోపే. తల్లిదండ్రులను కోల్పోయిన వీరి బాధ్యతను(Help for children) అధికారులు తీసుకుంటే మేలని స్థానికులు అంటున్నారు. పిల్లలిద్దరికీ మెరుగైన విద్య అందేలా చూడాలంటున్నారు. శిశుసంక్షేమ శాఖ నుంచి వీరికి కావాల్సిన సాయం దక్కేలా చొరవ చూపాలి. వారికి కనీసం తమకు ఎంత కష్టమొచ్చిందనే విషయమూ అర్థంకాని పరిస్థితి. చిన్నవయసులోనే అమ్మానాన్నల ప్రేమకు దూరమైన వారికి బంధువులతో పాటు స్థానికులూ అండగా నిలవాలి. ఇదీ చదవండి: తల్లి ఆత్మహత్య.. అనాథలుగా మిగిలిన ముగ్గురు పిల్లలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.