సంగారెడ్డి విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన 1.5 మెగావాట్ల 'రూఫ్‌టాప్ సోలార్ సిస్టం' ను టీస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ప్రారంభించారు. గృహ వినియోగదారులు తమ ఇళ్లల్లో సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 2014లో కేవలం 37 మెగావాట్ల సోలార్ విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అయ్యేదని ప్రస్తుతం 3600 మెగావాట్లు తయారవుతోందన్నారు. సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే విద్యుత్ శాఖ తరఫున విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలిపారు.
ఇవీ చూడండి: విడ్డూరం: సొంత బస్సునే చోరీ చేసిన యజమాని