ETV Bharat / state

'ప్రభుత్వ సహకారంతో పటాన్​చెరుని అభివృద్ధి చేస్తా' - పటాన్​చెరు డివిజన్​లో తెరాస ప్రచారం

పటాన్​చెరు డివిజన్​లో తనను గెలిపిస్తే పట్టణంలో మౌలికవసతులపై కృషి చేస్తానని తెరాస అభ్యర్థి మెట్టు కుమార్​ యాదవ్​ హామీ ఇచ్చారు. గ్రేటర్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్​లో పర్యటించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల పటాన్​చెరులో ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు.

trs corporator campaign in patancheru division
ప్రభుత్వ సహకారంతో పటాన్​చెరుని మరింత అభివృద్ధి చేస్తా: అభ్యర్థి
author img

By

Published : Nov 22, 2020, 6:54 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల దృష్ట్యా పటాన్​చెరు డివిజన్​లో తెరాస అభ్యర్థి మెట్టు కుమార్​ యాదవ్​ ప్రచారం నిర్వహించారు. తనని గెలిపిస్తే పట్టణంలో మౌలిక వసతులపై కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తానని అన్నారు. డివిజన్​లో తెరాస ప్రభుత్వం విస్తృతంగా అభివృద్ధి జరిపిందని, చాలామందికి సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. అందువల్లే తెరాసను ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ప్రభుత్వ సహకారంతో పటాన్​చెరుని మరింత అభివృద్ధి చేస్తా

రహదారులు, భూగర్భ మురుగు కాలువలు, విద్యుత్, నీరు వంటి సమస్యలపై స్పందిస్తూ వాటిని పరిష్కరిస్తూ ఎప్పటికప్పుడు డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటానని అభ్యర్థి తెలిపారు. ప్రభుత్వ సహకారంతో పటాన్​చెరుని మరింత అభివృద్ధి చేస్తానని​ హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: 'గ్రేటర్​ ఎన్నికలను హిందూ, ముస్లింల మధ్య పోటీగా చిత్రీకరించవద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.