సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకులను మోసం చేసి డబ్బులు వసూలు చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కో నిరుద్యోగి నుంచి రూ. 2 నుంచి 5 లక్షల వరకు వసూలు చేసారని డీఎస్పీ బాలాజీ తెలిపారు.
ఇప్పటి వరకు 24 మంది నిరుద్యోగుల నుంచి రూ. 64 లక్షలు వసూలు చేశారన్నారు. ఒకరు పరారీలో ఉన్నారని.. అతని కోసం గాలిస్తున్నామని అన్నారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని మాటలు చెబితే నమ్మవద్దవని సూచించారు. నిందితులను రిమాండ్కు పంపిస్తామని తెలిపారు. మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చూడండి: నేరాలు 10 శాతం తగ్గాయి : సీపీ అంజనీకుమార్