అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డిలో జరిగింది. జిల్లాలోని రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ యూనిట్లో పనిచేస్తున్న కళ్యాణ్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అంతేగాక అతను మతిస్థిమితం లేక ఇబ్బందులు పడుతున్నాడు.
ఇటీవల కాస్త ఆరోగ్యం కుదుటపడగా... బీహెచ్ఈఎల్ పరిశ్రమలో అప్రెంటిస్‌గా విధుల్లో చేరాడు. ఇంతలోనే నాగులపల్లి రైల్వే ట్రాక్‌పై రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: గ్రానైట్ లారీ, ఆటో ఢీకొని ముగ్గురు మృతి