The husband killed his wife in Sangareddy: ఏదైనా బంధం నిలబడాలంటే వారి మధ్య నమ్మకం ఎంతో ముఖ్యం. ఆ నమ్మకం లేనప్పుడు అనుమానం అనే పెనుభూతం మొదలవుతుంది. దీనివల్ల చాలా దారుణాలు జరుగుతాయి. వారు ఆ క్షణం నుంచి సంతోషాన్ని మరిచిపోయి ఎదుటి వ్యక్తిపైన నిందలే కనిపిస్తాయి. అనుమానం రోజు రోజుకి పెరిగి ఒక్కసారిగా బద్దలై ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. ఎక్కువగా భార్యాభర్తల మధ్య సఖ్యత లేనప్పుడు ఇద్దరిలో ఎవరో ఒక్కరికి ఈ పెనుభూతం పట్టుకుంటుంది. ఈ అనుమానంతో రగిలిపోతున్న వ్యక్తి ఎలా ప్రవర్తిస్తారో తెలియని పరిస్థతి ఏర్పాడుతుంది. అలానే సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త గొడ్డలితో నరికి హత్య చేశాడు. వెంటనే తన భార్య మృతదేహాన్ని చూసి భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం నాదులాపూర్ గ్రామానికి చెందిన ముద్దాయిపేట్ నారాయణ(55), మల్లమ్మలు భార్యాభర్తలు. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఇటీవలే కూతురికి వివాహం చేశారు.
నారాయణ, మల్లమ్మ ఇద్దరు జీవనోపాధి కోసం హైదరాబాద్ వలస వెళ్లారు. నగరంలో వాచ్మెన్గా నారాయణ పనిచేశాడు. తన భార్యపై అనుమానంతో రోజూ పోట్లాడుకునేవారు. ఆదివారం మెదక్ జిల్లా టేక్మాల్ మండలం అచ్చన్నపల్లి గ్రామంలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి దంపతులు ఇద్దరు వెళ్లారు. ఆ కార్యక్రమం అయిపోయాక స్వగ్రామమైన నాదలాపూర్కి వచ్చారు. రాత్రి వారు ఇద్దరు తీవ్రంగా గొడవ పడ్డారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆ గొడవలో గొడ్డలితో ఒక్కసారిగా మెడ మీద నరికేశాడు. దీంతో ఆమె కుప్పకూలి అక్కడే చనిపోయింది. భార్య మృతదేహాన్ని చూసి భయపడి ఇంట్లోని దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
స్థానికులు ఉదయం వారు ఎంతకీ బయటకి రాకపోడంతో వారి ఇంటి తలుపులు బద్దలు కొట్టారు. వారు ఇంట్లో రక్తపు మడుగులతో ఉన్న మల్లమ్మని, దూలానికి వేలాడుతున్న నారాయణని చూసి భయపడ్డారు. వెంటనే గ్రామ సర్పంచ్ పోలీసులకు సమాచారం తెలియజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసిన స్థానిక ఎస్ఐ సామ్యా నాయక్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండ: