ETV Bharat / state

జహీరాబాద్​లో పారిశుద్ధ్య కార్మికురాలికి తొలి కొవిడ్​ టీకా

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. జహీరాబాద్​ ప్రాంతీయ ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే మానిక్ రావు వ్యాక్సినేషన్​ను ప్రక్రియను ప్రారంభించారు. తొలి టీకాను ఆసుపత్రిలోని పారిశుద్ధ్య కార్మికురాలికి ఇచ్చారు.

The first covid vaccine for a sanitation worker in sangareddy
సంగారెడ్డిలో పారిశుద్ధ్య కార్మికురాలికి తొలి కొవిడ్​ టీకా
author img

By

Published : Jan 16, 2021, 1:34 PM IST

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆస్పత్రిలో కొవిడ్​ టీకా పంపిణీ ప్రక్రియను స్థానిక ఎమ్మెల్యే మానిక్ రావు ప్రారంభించారు. కొవిడ్ ఐసోలేషన్ వార్డులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఆయన వ్యాక్సిన్​ను వైద్యులకు అందజేశారు.

తొలి కరోనా వ్యాక్సిన్​ డోసును ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికురాలు ఎలిజిబెత్​కు ఇచ్చారు. అనంతరం వ్యాక్సిన్​ను ఆసుపత్రి సీనియర్ వైద్యుడు డాక్టర్ సునీల్ తీసుకున్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం టీకా తీసుకున్న వారందరికీ విశ్రాంతి అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చదవండి: నకిలీ విలేకరులను అరెస్ట్ చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.