సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం బాబుమోహన్ కాలనీలో మాజీ కౌన్సిలర్ నామా రవికిరణ్ దంపతులు సుమారు 100 నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు. 15 రోజులకు సరిపడ బియ్యం, కూరగాయలను పంపిణీ చేశారు.
లాక్డౌన్ పొడిగింపు చేసిన సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. కార్మికుల కుటుంబాలకు చేయూత అందించేందుకు మరింత మంది ముందుకు రావాలని సూచించారు.
ఇదీ చూడండి : కానిస్టేబుల్ భార్యను పరామర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే