సంగారెడ్డి జిల్లా కరోనా ఫ్రీ జిల్లాగా మారిందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. జిల్లాలో కరోనా బారిన పడినవారు కోలుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి హరీశ్‌రావు కొత్త బట్టలు, నిత్యావసర సరుకులను అందించారు.
గతంలో రాష్ట్ర ఆదాయం రోజుకు రూ.400 కోట్ల వరకు ఉండేదని.. ప్రస్తుతం నెల మొత్తం కూడా అంత ఆదాయం రావడం లేదని మంత్రి పేర్కొన్నారు. అయినా ప్రజలకు సాయం అందించడంలో ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదని.. నివారణ చర్యల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో ఏడున్నర లక్షల మంది వలస కార్మికులకు బియ్యం, రూ.500 సాయం అందించామని మంత్రి పేర్కొన్నారు. 74 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.1500 జమ చేశామన్నారు. మే నెలలోనూ ఈ సాయం అందిస్తామని స్పష్టం చేశారు.
ఇప్పటికే సిద్దిపేట జిల్లా కరోనా ఫ్రీ జిల్లాగా మారగా.. తాజాగా సంగారెడ్డి జిల్లా కరోనా నుంచి విముక్తి పొందింది. ప్రస్తుతం మెదక్ జిల్లా పరిధిలో ఐదుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి:'దొంగ కరోనా' కేసులతో చైనాలో మళ్లీ ఆందోళన