శారీరక ఎదుగుదల లేని విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి పౌష్టికాహారం అందించేలా చూడాలని... తెలంగాణ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ తిరుమల్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. రంజోల్లోని అంగన్వాడీ కేంద్రం, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు.
గురుకుల వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు సంపూర్ణ పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన భోజనంతో పాటు గుడ్లను నిర్ణీత మెనూ ప్రకారం అందించాలని సూచించారు.
ఇదీ చదవండి: 'తెలంగాణపై అవగాహన లేని వారు వచ్చి విమర్శలు చేస్తున్నారు'