తెలంగాణ నుంచి ఉత్తర భారతదేశ పుణ్యక్షేత్రాలకు వెళ్లిన భక్తులు లాక్ డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, ఇస్నాపూర్, జహీరాబాద్, ఎల్బీనగర్, కరీంనగర్ల నుంచి ఒకే కుటుంబానికి చెందిన 17 మంది సభ్యులు ఈనెల 17వ తేదీన కాశీ యాత్రకు వెళ్లారు. రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల వారణాసిలో చిక్కుకున్నారు.
రావడానికి రెండుసార్లు టికెట్లు బుక్ చేశారు. విమానయాన సేవలు నిలిచిపోవడం వల్ల బుక్ చేసుకున్న టికెట్లు రద్దయ్యాయి. వెళ్లిన వారిలో చాలా మంది పెద్ద వయసు వారు ఉండటం వల్ల వారు అనారోగ్యం పాలవుతున్నారు. తీసుకెళ్లిన మందులు కూడా అయిపోయాయని చెప్పారు. తమను ఇంటికి తీసుకెళ్లండి అంటూ వేడుకుంటున్నారు.
ఇవీచూడండి: 'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం