ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆర్టీసీ ఐకాస నాయకులు నిరసన చేపట్టారు. పట్టణంలోని డిపో కార్యాలయం ఎదుట కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన రెండో రోజుకు చేరింది. సంస్థలో డ్రైవర్లు, కండక్టర్లతో పాటు అన్ని విభాగాల్లోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె బాట తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులను పొగడ్తలతో ముంచెత్తిన సీఎం కేసీఆర్.. సమస్యలు పరిష్కరించాలని కోరితే మాత్రం ఆర్టీసీని కించపరుస్తూ.. వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : ఆత్మహత్య చేసుకోమని మహిళకు తోటి ఉద్యోగుల వేధింపులు