ETV Bharat / state

నాచురల్ హౌస్: ఆ ఇంటిని చూస్తే ఔరా అనాల్సిందే! - సంగారెడ్డి జిల్లాలోని సహజసిద్ధమైన ఇంటి కథ

ఈ ఇల్లుని చూస్తే... పాత పెంకుటిల్లులా అనిపిస్తుంది. కానీ అసలు ఈ ఇల్లు నిర్మాణానికి కావాల్సిన ముడి సరకు అంతా ఇక్కడ దొరికేదే. కొనాల్సింది ఏమీలేదు... అంతా సహజ సిద్ధం... చూసేవారిని మాత్రం అబ్బుర పరుస్తుంది. అసలు ఆ ఇంటి నిర్మాణం వెనక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం...

ఇదో సహజసిద్ధమైన ఇల్లు... ఎవరైనా ఔరా అనాల్సిందే!

author img

By

Published : Dec 22, 2020, 3:53 PM IST

సంగారెడ్డి జిల్లా హత్నూర మండల సమీపంలో గల బడేంపేట గ్రామ సమీపంలోనిది ఈ ఇల్లు.. ఈ చిత్రాలు చూస్తే పాత పెంకుటిల్లు అనిపిస్తుంది. సహజ సిద్ధంగా నిర్మించిన భవనం ఇది. మట్టి సున్నం, ఆవు పేడ, వరి గడ్డి, ముడిసరకును పశువులతో బాగా తొక్కించి... వచ్చిన మిశ్రమంతో దీనిని నిర్మించారు.

special story on Natural home at  Hatnur , Sangareddy District
ఇదో సహజసిద్ధమైన ఇల్లు

ఆ ఇంటి అందం చూడతరమా...!

ఇంటి నిర్మాణానికి వెదురు కర్రలు, గ్రానైటు రాయి​ని వినియోగించారు. ఆ ఇంటికి మరో ప్రత్యేకత ఉంది. చలికాలం, వర్షకాలం వస్తే... లోపల వెచ్చగానూ... వేసవి కాలంలో చల్లగానూ ఉంటుంది. ఫ్యాన్​లు అవసరం ఉండదు. విద్యుత్​ వాడకం కూడా చాలా తక్కువ. ఇందుకోసం ప్రత్యేకంగా పెద్దవి, చిన్నవి కిటికీలు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన వారు పాత ఇల్లు అనుకుంటారు. లోపలికి వెళ్తే... ఓ అద్భుతమైన అనుభూతికి లోనవుతారు.

వెదురు బొంగులతో ఇంటి నిర్మాణం

చూపరులను ఆకట్టుకునే ఇల్లు

2016 లో ఆక్సి స్వచ్ఛంద సంస్ధ వారు సమావేశాలు నిర్వహించుకోవడానికి కూడలి పేరుతో ఇంటిని నిర్మాణం చేశారు. ఇందుకోసం హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి నిర్మాణ నిపుణులను తెప్పించి దీనిని నిర్మాణం చేశారు. ఒకసారి లోపలికి వెళ్తే... ఎవరైనా ఔరా అనాల్సిందే మరి. అలా ఉంది ఈ ఇంటి నిర్మాణం.

గ్రానైట్​ రాయితో నిర్మాణం

వెదురు కర్రలతో నిర్మాణం

ఇదీ చూడండి: ఆ ఇంట్లో అవసరాలన్నింటికీ వాననీరే వాడతారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.