ETV Bharat / state

అమీన్​పూర్​ ఎంపీడీవోకు షోకాజ్​ నోటీసులు జారీ

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ ఎంపీడీవోకు జిల్లా పాలనాధికారి హనుమంతరావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారంలోగా షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వడంతో పాటు ఆయా గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లోని పిచ్చిమొక్కలు తొలగించి పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపర్చాలని... లేనట్లయితే సస్పెన్ష్​కు రంగం సిద్ధం చేయడం ఖాయమని కలెక్టర్ పేర్కొన్నారు.

show-cause notice for aminpur mpdo
show-cause notice for aminpur mpdo
author img

By

Published : Jul 17, 2020, 9:53 PM IST

విధుల్లో నిర్లక్ష్యం వహించిన సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ ఎంపీడీవోకు జిల్లా పాలనాధికారి హనుమంతరావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో సూచించిన మేరకు పనులు మెరుగు కాకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో జిల్లా పాలనాధికారి హనుమంతరావు నిర్వహించిన ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పలు గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణాలు పూర్తికాకున్నా.. పూర్తి అయినట్లు నివేదిక సమర్పించటాన్ని కలెక్టర్​ గుర్తించారు.

దీనిపై స్పందించిన కలెక్టర్.. ఎంపీడీవో మల్లేశ్వర్​కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పాలనాధికారి హనుమంతరావు హెచ్చరించారు. పారిశుద్ధ్య నిర్వహణలో కొంచెం కూడా శ్రద్ధ తీసుకున్నట్లు కనిపించలేదన్నారు. వారంలోగా షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వడంతో పాటు ఆయా గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లోని పిచ్చి మొక్కలు తొలగించి పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపర్చాలని.. లేనట్లయితే సస్పెన్షన్ రంగం సిద్ధం చేయడం ఖాయమని కలెక్టర్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: గాలి ద్వారా కరోనా.. అడ్డుకోవడం ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.