ఖరీఫ్ సీజన్లో రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తెలిపారు. అన్నదాతలకు రాయితీపై విత్తనాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా సమన్వయకర్త వెంకటరామిరెడ్డి, పలువురు వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: భిక్షాటన చేసిన సర్పంచ్... మళ్లీ నిరసన