ETV Bharat / state

ఎస్బీఐలో చోరీకి దొంగల విఫలయత్నం! - పటాన్​ చెరు వార్తలు

ఎస్బీఐ బ్యాంకులో చోరీకి ప్రయత్నించి విఫలమైన దొంగలు.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. బ్యాంకుకు రెండు రోజులు సెలవు కావడం వల్ల గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.

sbi bank robbery attempt failed in sangareddy district
ఎస్బీఐ బ్యాంకు చోరీకి దొంగల విఫలయత్నం!
author img

By

Published : Aug 17, 2020, 4:11 PM IST

గుర్తుతెలియని దుండగులు ఎస్బీఐలో చోరీకి ప్రయత్నించి విఫలమైన ఘటన సంగారెడ్డి జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. పటాన్​చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్​ గత రెండు రోజులుగా సెలవు కారణంగా మూసి ఉంచారు. జనరేటర్​ గది కిటికీ గుండా బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు గ్యాస్​ కట్టర్​తో స్ట్రాంగ్​ రూమ్​ తెరిచే ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నించినా స్ట్రాంగ్​ రూమ్​ తెరుచుకోకపోవడం వల్ల దొంగలు వెనుదిరిగారు.

పోలీసులకు ఆధారాలు దొరకకుండా సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. బీడీఎల్​ భానూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరిస్తున్నారు. బ్యాంకు చోరీకి ప్రయత్నించిన దుండగులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

ఇదీ చూడండి : 'మెడికల్ హబ్​గా హైదరాబాద్​ మహానగరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.