సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 47వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగానే పట్టణంలోని డిపో ఆవరణలో ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి... కార్మికులను చర్చలకు ఆహ్వానించాలని కోరారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస నేతల అత్యవసర భేటీ...