ETV Bharat / state

'ప్రకృతి పరిరక్షణకు అందరూ నడుం బిగించాలి' - సంగారెడ్డిలో హరితహారం కార్యక్రమం

హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్​ రెడ్డి పేర్కొన్నారు. చెట్లు లేకపోతే భవిష్యత్తులో దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నారు.

Sangareddy SP Chandrashekar reddy Participated in 6th term Harithaharam Programme
'ప్రకృతి పరిరక్షణకు అందరూ నడుం బిగించాలి'
author img

By

Published : Jun 27, 2020, 12:56 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీసు మైదానంలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మొక్కలు నాటారు. చెట్లు ఉంటే వర్షాలు పుష్కలంగా కురుస్తాయన్న విషయాన్ని గ్రహిస్తే భవిష్యత్తు తరాలకు మనం మంచి చేసిన వాళ్లమవుతామని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

చెట్లు, అడవులు లేకపోతే వర్షాలు పడక, పంటలు పండక చాలా దుర్భర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని వివరించారు. ప్రకృతిని పరిరక్షించుకునేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీచూడండి: గ్రేటర్‌లో కరోనా పంజా... మూతబడుతోన్న కార్యాలయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.