సంగారెడ్డి నియోజకవర్గంలో లాక్డౌన్(Lock down) పటిష్టంగా కొనసాగుతోంది. అత్యవసరం అయితేనే జనాలు బయటకు రావాలని పోలీసులు ఆదేశించారు. అనవసరంగా బయటకి వస్తే వాహనాలు సీజ్ చేసి కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు.
చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు గుర్తింపు కార్డులు ఉంటేనే బయటకి అనుమతిస్తున్నారు. మినహాయింపు సమయంలో కూడా కరోనా నియంత్రణ జాగ్రత్తలు పాటించాలని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: DIGITAL SURVEY: జూన్ 11 నుంచి పైలట్ విధానంలో డిజిటల్ భూసర్వే