ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయస్థానంలో జిల్లా జడ్జ్ పాపిరెడ్డి, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. భవిష్యత్ కార్యాచరణకు మొక్కలు నాటి ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర వహించాలన్నారు. ఉన్న మొక్కల్ని కాపాడకపోవడమే కాకుండా… కొందరు వాటిని నాశనం చేయడం బాధాకరమని అన్నారు.
అవకాశం ఉన్న ప్రతి సారి మొక్కలు నాటి వాటి ఉపయోగాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని జడ్జ్ పాపిరెడ్డి కోరారు. చెట్లు లేకపోవడం వల్ల నీటి కొరత ఏర్పడిందన్నారు. మొక్కలు నాటి భవిష్యత్లో నీటి కొరత లేకుండా మనం కృషి చేయాలని కోరారు. కరోనా నియంత్రణ కూడా పర్యావరణాన్ని బట్టి వ్యాప్తి చెందిందన్నారు. అందరూ తమ వంతుగా పర్యావరణ పరిరక్షణ కోసం తప్పనిసరిగా తోడ్పడాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Corona Third Wave : మూడో దశకు అప్రమత్తమైన కరీంనగర్